image



రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్ల అరంగేట్రం
January 2023



→  వృందా  , జనని నారాయణన్, గాయత్రి వేణుగోపా లన్ చరిత్ర సృష్టించారు.  
→  రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లుగా ఆరంగేట్రం చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. మంగళవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్ ల్లో ఈ ముగ్గురు అంపైర్లుగా బాధ్య తలు నిర్వర్తించారు. 
→  జార్ఖండ్, చత్తీస్గఢ్ మధ్య మ్యాచ్లో గాయత్రి, రైల్వేస్, త్రిపుర పోరులో జనని, గోవా, పాండిచ్చేరి మ్యాచ్లో వృందా అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు.  
→  ఐటీ ఉద్యోగం చేసే జననికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. తాను అంపైర్ కావాలనుకుంటున్నట్లు తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ)కు పలు దఫాలు విజ్ఞప్తి చేసింది.  
→  కొన్నేళ్ల తర్వాత టీఎన్సీఏ నియమావళిని మార్చి మహిళలకు అవ కాశమిచ్చింది. 2018లో బీసీసీఐ లెవెల్ -2 పరీక్ష పాసైన జనని.  
→  2021లో తమిళనాడు ప్రీమియర్ లీగ్ అంపైర్గా విధులు నిర్వహించింది.  
  →ముంబయి మైదానాల్లో స్థానిక మ్యాచ్లకు స్కోరర్గా వ్యవహరించిన వృందా.. 2013 మహి కల ప్రపంచకప్లో బీసీసీఐ స్కోరర్ గా పనిచేసింది. అనం తరం అంపైరింగ్ కు మారింది.  
→  క్రికెటర్ కావాలనుకున్న గాయత్రి  భుజం గాయం కారణంగా నిర్ణయం మార్చుకుంది. 2019లో బీసీసీఐ అంపైర్ గా కెరీర్ మొదలుపెట్టింది. 
 



Sports