image



ఆహార సంక్షోభం అంచున పాక్
January 2023



 
 
 
→ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిండుకుంటున్న విదేశీ మారక నిల్వలు పాకిస్థా న న్ను ఆహార సంక్షోభం అంచున నిలబెట్టాయి. 
→ ఆఖరికి ఇక్కడి ప్రజల ప్రధాన ఆహారమైన గోధుమ పిండికీ దేశంలో తీవ్ర కొరత ఏర్ప ఉంది. 
→ సబ్సిడీ అందిస్తున్న గోధుమ పిండి కోసం వేల మంది ప్రజలు గంటల కొద్దీ క్యూల్లో వేచి చూస్తున్నారు. 
→ ఖైబర్ పబ్లూన్భ్వా, సింద్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో బారులు తీరి ఉన్న వరుసల్లో తొక్కిసలాటలూ, తోపులాటలూ నిత్యకృత్యమయ్యాయి. 
→ సింధ్ ప్రావిన్స్లోని రేషన్ దుకాణం వద్ద తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. కొన్నిచోట్ల భద్రతా బల గాల పర్యవేక్షణలో పంపిణీ చేసే పరిస్థితి ఏర్ప డింది. 
→ ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకు నేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తుండటంతో కేజీ గోధుమ పిండి ధర రూ.150కి పెరిగిపోయింది. 
→  ఆకలి చావులు ఆపేందుకు తక్ష బలూచిస్థాన్ మే 4 లక్షల గోధుమ పిండి బస్తాలు కావాలని అక్కడి మంత్రి వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 
→  పాక్ లో ఆహార సంక్షోభం. రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 
→  గోధుమలను ఎంత మొత్తంలో దిగుమతి చేసుకోవాలో ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని స్థానిక పత్రిక పేర్కొంది.
 
చుక్కల్లో నిత్యావసరాల ధరలు :- 
 
→2022లో వచ్చిన వరదలతో అప్పటికే బలహీ నంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.
→ ద్రవ్యోల్బణం పైపైకి వెళ్లిపోవ డంతో ప్రస్తుతం నిత్యావసరాలు కొనుగోలు చేయడమే గగనంగా మారింది. 
→ 2022 జనవ రిలో రూ.36.7గా ఉన్న కేజీ ఉల్లిపాయల ధర 501 శాతం పెరిగి ఏకంగా రూ. 220, 48 చేరింది. 
→ అరటిపళ్లు డజను రూ. 119, కేజీ చికెన్ రూ.384, లీటరు పాలు రూ.149.7.. ఇలా ప్రతి వస్తువూ సామాన్యులకు చుక్కలు చూపి స్తోంది. 
→ పెట్రోల్ ధరలు 48 శాతం, డీజిల్ ధరలు 61 శాతం పెరిగాయి. 
→ పాక్ విదేశీ మారక నిల్వలు 580 కోట్ల డాలర్లకు పడిపోయి ఎనిమిదేళ్ల కనిష్టానికి చేరాయి. ఇవి మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తెలిపింది.
 



International