image



కీలక ఆయుధ కొనుగోళ్లకు రక్షణశాఖ ఆమోదం
January 2023



→ సైనిక దళాల పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ   మూడు కీలక ఆయుధ సమీక రణ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. 
→వీటి విలువ రూ.4,276 కోట్లు. రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీటి ప్రకారం...  
 
→1 ట్యాంకు విధ్వంసక హెలీనా గైడెడ్ క్షిపణుల కొనుగోలుకు సమ్మతి.  
→ఈ అస్త్రాలు, లాంచర్లు, సంబంధిత ఇతర సాధన సంపత్తిని సైన్యంలోని అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్ హెచ్)కు అనుసంధానిస్తారు. దీనివల్ల భారత బలగాల దాడి సామర్థ్యం పెరుగుతుంది.  
 
→చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి గగనతల రక్షణ వ్యవస్థకు ఊతమివ్వడానికి 'వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్' (వీఎస్ హెచ్ఆర్ఎండీ) క్షిపణుల సమీకరణకు పచ్చ జెండా.  
→వీటిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. ఈ వ్యవ స్థను సైనికుడు తన భుజం మీద మోసుకె ళ్లొచ్చు. అవసరమైన ప్రాంతాల్లో వేగంగా మోహరించొచ్చు.  
→ఉత్తర సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి సమర్థ గగనతల రక్షణ వ్యవస్థలు అవసరమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.  
 
→నౌకాదళంలోని శివాలిక్ తరగతి యుద్ధనౌ కలు, భవిష్యత్ తరం పోరాట నౌకలైన 'నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెసెల్' (ఎన్ఐఎంవీ) కోసం బ్రహ్మోస్ లాంచర్, ఫైర్ కంట్రోల్ వ్యవస్థల కొనుగోలుకూ డీఏసీ ఆమోదం తెలిపింది.  
→వీటి వల్ల ఆ యుద్ధనౌకల పోరాట సామర్థ్యం రాటు లుతుంది.  
 



Science