imageతెలంగాణలో మరో విడత రైతుబంధు జమ
January 2023→  తెలంగాణలో రైతుబంధు పథకం కింద 1,87,847 మంది రైతులకు చెందిన 8,53,409.25 ఎకరాలకు వారి ఖాతాల్లో రూ.426. 69 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. 
 
→  వీరంతా నాలుగు నుంచి అయిదెకరాలలోపు భూమి ఉన్నవారు. మరింతమంది అయిదెకరాల లోపు ఉన్న రైతులకు    సొమ్ములు జమ చేస్తామని వివరించారు. 
 
→  ఇప్పటివ రకూ మొత్తం 56,58,484 మంది రైతుల ఖాతాల్లో రూ.4754. 64 కోట్లు వేసినట్లు వివరించారు. 
 
→  పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తి చేస్తామ న్నారు. కరోనా ఇబ్బందులున్నా రైతుబంధు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ
ప్రభుత్వానిదన్నారు. 
 
→ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 100 శాతం కొనుగోళ్లు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు.
 TS