image



ఇస్రో- మైక్రోసాఫ్ట్ ఒప్పందం
January 2023



→ అంతరిక్ష రంగంలో సాంకేతిక అంకురాలను ప్రోత్సహిస్తూ.. వాటి ప్రగతిని పర్యవేక్షించేందుకు భారతీయ అంతరిక్ష పరి శోధన సంస్థ (ఇస్రో), ప్రఖ్యాత ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదు ర్చుకున్నాయి. 
 
→ ఈ సంస్థలు   ఓ ప్రకటనలో సంయుక్తంగా వెల్ల డించిన వివరాల ప్రకారం.. దేశ అంతరిక్ష రంగంలో ప్రవేశించే ఔత్సాహి కులు ఆవిష్కరించే సాంకేతిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ సదు పాయం కల్పించేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుంది. 
 
→ ఇస్రో గుర్తిం చిన అంకురాలను మైక్రోసాఫ్ట్ ఫర్ ఫౌండర్స్ హబ్ ద్వారా ప్రోత్సహిస్తారు. అంకురాల ఆలోచనలకు మెంటరింగ్ సదుపాయాన్ని కల్పిస్తారు. 
 
→ ఈ సంద ర్భంగా ఇస్రో అధ్యక్షుడు ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ ఒప్పందం ద్వారా ఉపగ్రహాల డేటా, ఆప్లికేషన్లు, కృత్రిమ మేధస్సు, మెషీన్, డీప్ లెర్నింగ్ సాంకేతికతల వినియోగం సులభమవుతుందని పేర్కొన్నారు.
 



Science