image



హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ (టీఐఈఎస్) 57వ వార్షిక సదస్సు
January 2023



→ 2047 నాటికి భారత దేశ జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) 20 ట్రిలియన్ డాల ర్లకు చేరుకుంటుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవాయ్ అన్నారు. 
 
→ తలసరి ఆదాయం పదివేల డాలర్లకు చేరుతుందని, దీని వల్ల భారత్ సమాజ స్వభావం పూర్తిగా మారిపోతుందని ఆయన పేర్కొన్నారు. 
 
→   హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ (టీఐఈఎస్) 57వ వార్షిక సదస్సు నిర్వహిం చారు. 
 
→   ఈ సదస్సుకు వివేక్ దేవాయ్ ఆన్లైన్లో హాజరై మాట్లాడారు... 2023-24లో వృద్ధి రేటు ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారన్నారు. 
 
→   రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఐరోపా, అమెరికాలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఫోరెక్స్ మార్కెట్లు, క్యాపిటల్ మార్కెట్ల అంశాల్లో భారత్ కొంత అస్థిరత ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 
 
→   సరళతరమైన జీఎస్, డైరెక్ట్ ట్యాక్స్ విధానం భారత్కు అవసర మని, దీనిపై మరింతగా పరిశోధనలు జరగాలన్నారు. 
 
→   భారత్ వృద్ధి రేటును 7 నుంచి 8 శాతానికి పెంచా లంటే రాష్ట్ర స్థాయిలో పరిశోధనలు జరగాలన్నారు. 
 
→   టీఐఈఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. రామచంద్రన్, హెచ్సీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి. జె. రావు తదితరులు పాల్గొన్నారు.
 



Summits