image



భద్రతా మండలికి కొత్త సభ్యులు
January 2023



→ భద్రతా మండలి అయిదు కొత్త సభ్య దేశాలకు స్వాగతం పలికింది. జపాన్, స్విట్జ ర్లాండ్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా దేశాలు మండ లిలో రెండేళ్ల పాటు సభ్యులుగా ఉంటాయి. 
 
→ భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే దేశాలు రెండేళ్ల సభ్యత్వ కాలం డిసెంబరు 31తో ముగిసినందున కొత్త సభ్యులు వాటి స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి. 
 
→ భద్రతా మండలిలో శాశ్వత సభ్యులైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్ ్సలకు వీటో అధికారం ఉంది. 
 
→ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోని 193 సభ్య దేశాల నుంచి దఫాలవారీగా 10 దేశాలు రెండేళ్లపాటు తాత్కాలిక సభ్యత్వం పొందు తాయి. 
 
→ ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి వీటిని ఎంపిక చేస్తారు. చిన్న దేశాల వాణి కూడా సమితిలో ప్రతిఫలించేలా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. అయినా 1946లో భద్రతా మండలి ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు 60 దేశాలు సభ్యత్వానికి నోచుకో లేదు. 
 
→  ఈసారి కొత్త సభ్యులైన అయిదు దేశాలు జూన్ లో పోటీ లేకుండా ఆ గౌరవం పొందాయి.
 
→  వీటిలో జపాన్ 12 సార్లు మండలి తాత్కాలిక సభ్యత్వం పొందగా, ఈక్వెడార్ నాలుగుసార్లు, మాల్టా రెండోసారి పొందాయి. 
 
→  స్విట్జర్లాండ్, మొజాంబిక్ లు సభ్యత్వం పొందడం ఇదే మొదటిసారి. ప్రపంచంలో సంఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు శాంతి సేనలను భద్రతా మండలి పంపుతుంది. 
 
→  కట్టు తప్పిన దేశాలపై ఆంక్షలు విధిస్తుంది. ఉగ్రవాదం, ఆయుధ నియంత్రణపై కూడా గళమెత్తుతుంది. కొత్తగా ఎదురయ్యే సమస్యలనూ సభ్య దేశాలు మండలిలో ప్రస్తావిస్తాయి.
 



International