→రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత రాజ్యాంగం సజీవ పత్రమని.. ప్రజల ఆశలు, ఆశయాలను ప్రతిబింబించే శక్తి దానికి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
→ రాజ్యాంగానికి ఇంతవరకు చేసిన 105 సవరణలే అందుకు సాక్ష్యమన్నారు.
→ రాజస్థాన్ రాజధాని జైపు ర్ లో స్మార్ట్ నగరాల పథకం కింద నిర్మించిన రాజ్యాంగ పార్కు (సంవిధాన్ ఉద్యాన్ )ను రాష్ట్రపతి ప్రారంభించారు.
→ అనంతరం మాట్లా డుతూ.. భావి తరాల అవసరాలకు అనుగుణంగా తగు సవరణలు చేసుకోవడానికి రాజ్యాంగంలోనే వెసులుబాటు కల్పించారని గుర్తు చేశారు.
→ రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పార్కులో రాజ్యాంగ రచన మొదలుకొని అమలు వరకు వివిధ ఘట్టాలను శిల్పాలు, చిత్రాల రూపంలో ఇక్కడ ఏర్పాటుచేశారు.
National