image



2016 నోట్ల రద్దు తర్వాత పట్టుబడిన నకిలీ కరెన్సీ రూ.245.33 కోట్లు
January 2023



 
→దేశంలో నల్లధనం, నకిలీ నోట్లు, అవినీతి, ఉగ్ర నిధులకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన నోట్ల రద్దు పెద్దగా ఫలి తాన్ని ఇవ్వడంలేదు. 
 
 →ఇప్పటికీ నకిలీ నోట్ల బెడద ఏమాత్రం తగ్గలేదని జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) పేర్కొంది. 
 
 →ఈ మేరకు భారతీయ నకిలీ కరెన్సీ నోట్ల(ఎఫ్ఎఐసీఎన్) చలామణీపై సోమ వారం ఓ నివేదికను విడుదల చేసింది. 
 
 →నోట్ల రద్దు  దేశంలో నల్లధనం, నకిలి నోట్లు, అవినితి, ఉగ్ర నిధులకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన నోట్ల రద్దు పెద్దగా ఫలి తాన్ని ఇవ్వడంలేదు. 
 
 → ఇప్పటికీ నకిలీ నోట్ల బెడద ఏమాత్రం తగ్గలేదని జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్టీఆర్) పేర్కొంది. 
 
 → ఈ మేరకు భారతీయ నకిలీ కరెన్సీ నోట్ల(ఎఫ్ ఐసీఎన్) చలామణీపై సోమ వారం ఓ నివేదికను విడుదల చేసింది. 
 
 → నోట్ల రద్దు తర్వాత నుంచి 2021 వరకూ దేశవ్యాప్తంగా రూ.245. 33 కోట్ల విలువైన నకిలీ నోట్లను వివిధ దర్యాప్త సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు అందులో పేర్కొంది. 
 
 → గరిష్టంగా 2020లో రూ.92.17 కోట్లు, కనిష్ఠంగా 2016లో రూ.15.92 కోట్ల నకిలీ నోట్లు పట్టుబడినట్లు తెలిపింది. 
 
 → 2017లో రూ. 55.71 కోట్లు, 2018లో రూ. 26.35 కోట్లు, 2019లో రూ. 3479 కోట్లు, 2021లో రూ. 20.39 కోట్ల నకిలీ కరెన్సీని దర్యాప్తు సంస్థలు జప్తు చేసి నట్లు వెల్లడించింది. 
 
 → ఇదిలా ఉండగా 2022 మే నెలలో ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు గుర్తించిన నకిలీ రూ.500 నోట్ల సంఖ్య 79,669 కాగా, నకిలీ రూ. 2 వేల నోట్లు 13,604, 2020-21తో పోలిస్తే నకిలీ రూ. 500 నోట్లు రెట్టింపు కన్నా ఎక్కువగా పెరగగా, నకిలీ రూ.2 వేల నోట్లు 54.6 శాతం ఎక్కువయ్యాయి. 
 
 → 2020-21లో గుర్తించిన అన్ని రకాల నకిలీ నోట్ల సంఖ్య 2,08,625 కాగా, మరుసటి ఏడాది అవి 2,30,971కి పెరి గాయి. 
 
 → 2019-20లో వాటి సంఖ్య 2,96,695.  



Economy