image



ఉత్తరకొరియా లో బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
January 2023



→ ఉత్తరకొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్.. నూతన సంవత్సరానికి తనదైన శైలిలో క్షిపణి పరీక్షతో స్వాగతం పలికారు. 
 
→ ఈ ఏడాదిలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని కూడా స్పష్టం చేశారు. 
 
→ 2022లో రికార్డు స్థాయిలో ఆయుధ ప్రయోగ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా..   కూడా తూర్పు జలాల్లోకి ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయో గించింది. 
 
→ తద్వారా ఈ ఏడాది కూడా ఆయుధ పరీక్షలు భారీ ఎత్తున ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చింది. 
 
→ మరోవైపు, కొత్త సంవత్సరం సందర్భంగా అధికార పార్టీ సమావేశంలో మాట్లాడిన కిమ్.. అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామన్నారు. మరింత శక్తిమంత మైన ఖండాంతర క్షిపణులను తయారు చేస్తామని ప్రక ంచారు. 
 
→ అమెరికా సహా ఇతర ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ట పరుస్తా మన్నారు. 
 
→ దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేం దుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
→ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 
 
→ వేగవంతమైన కొత్త రకం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని తయారు చేయాలని అధికారులను కిమ్ ఆదేశించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ పేర్కొంది. 
 
→ అలాగే, తొలి సైనిక గూఢచార ఉపగ్రహాన్ని సైతం త్వరలో ప్రయోగించాలని కిమ్ యోచిస్తున్నట్లు తెలి పింది. 
 
→ తాజా క్షిపణి పరీక్షను దక్షిణ కొరియా, అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ తీవ్రంగా ఖండించాయి. ఉత్తర కొరియా తీవ్ర కవ్వింపు చర్యలకు దిగుతోందని, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాయి.
 



International