image



మెదడు సంకేతాలతోనే వాంతులు!
Janauary 2023



 
→ కలుషిత లేదా విషపూరిత ఆహారం తిన్నప్పుడు వాంతులు ఎందుకవుతాయి? వాంతి చేసుకోవాలనే ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సందేహాలకు సమాధానాలను విశ్లేషించే క్రమంలో చైనా పరిశోధకులు పలు ఆశ్చర్యకర మైన విషయాలు తెలుసుకున్నారు. 
 
→ మన శరీరా నికి సరిపడని ఆహారాన్ని తిన్నప్పుడు కడుపులో వికారం మొదలవుతుంది. 
 
→ ఆ వెంటనే పేగుల నుంచి వెలువడే సంకేతాల ఆధారంగా మెదడు   నిర్ణయం తీసుకుంటుందని, దాని ఆదేశాల ప్రకారం విషాహారాన్ని వాంతుల రూపంలో బయటకు నెట్టి వేయడం జరుగుతుందని చైనాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ శాస్త్రవే త్తలు తమ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పేగులు, మెదడుకు మధ్య ఉన్న పర మాణు వలయం కీలకపాత్ర వహిస్తున్నట్లు తెలు సుకున్నారు. 
 
→ పరిశోధనలో భాగంగా ఎలుకలకు విషపూరిత ఆహారం ఇచ్చినప్పుడు.. మనుషుల్లో మాదిరిగానే వాటి కడుపులో వికారం మొదలైంది. ఆ వెంటనే జీవకణ సముదాయాల స్థాయిలో రక్షణాత్మక ప్రతిస్పందనలు ప్రారంభమై, మెదడుకు సంకేతాలు చేరాయని న్యూరాలజిస్ట్ పెంగ్ కావొ వెల్లడించారు. 
 
→అనియంత్రిత కండరాలను ఉద్దీపిం పజేసే రక్తనాళికలు ఒక రసాయనిక ప్రక్రియను కలుగజేస్తాయని, పేగులు-మెదడు. ఆ సంకేతాలు ప్రసరిస్తాయని పరిశీల నలో గుర్తించారు. 
 
→అయితే, వివిధ రక్షణాత్మక ప్రతిస్పందనలను మెదడు ఎలా సమన్వయం చేసుకుందన్న విషయాలు పూర్తిస్థాయిలో తెలుసుకో వాల్సి ఉందని పేర్కొన్నారు.
 



Science