imageజగనన్న తోడు ఆరో విడత విడుదల
January 2023→జగనన్న తోడు పథకంతో రాష్ట్రంలో 15.31 లక్షల చిరు వ్యాపా రుల కుటుంబాలకు మేలు జరుగుతోందని. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 
 
→పేద కుటుంబాలకు రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని వివరిం చారు. 
 
→తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో   'జగనన్న తోడు ఆరో విడత లబ్ధిని విడుదల చేశారు. 
 
→3.35 లక్షల మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తిదా రులకు రూ.305 కోట్ల రుణాలతోపాటు గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీని బటన్ నొక్కి, లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 
 
→ఈ సందర్భంగా సీఎం మాట్లా డుతూ... 'సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపా రుల కష్టాలు చూశాను. 
 
→రూ. వెయ్యి అప్పులో ముందే 100 తీసుకుని నెల నాటికి మొత్తం కట్టించుకునే ఆధ్వాన పరిస్థితుల్లో సమాజం ఉండేది. 
 
→ఆ బాధల నుంచి వ్యాపారులకు | శాశ్వత పరిష్కారం చూపాలనే తాపత్రయంతో ఈ పథకం తీసుకొచ్చాం. పేద వ్యాపారులకు ఇస్తున్న రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది' అని వెల్లడించారు. 
 
→ఇప్పటివరకు చిరు వ్యాపారులకు రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాం. 
 
→15.31 లక్షల మంది లబ్దిదారుల్లో 8.74 లక్షల మంది రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించి బేష్ అనిపించుకు న్నారు. 
 
→దేశంలో ఇటువంటివి 39, 21 లక్షల రుణాలిస్తే.. ఏపీలోనే 21.06 లక్షబంధించాం. 
 
→దేశంలో ఇదో రికార్డు. లబ్ది పొందిన వారిలో దాదాపు 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా 'రిటీలే' అని జగన్ పేర్కొన్నారు.
 
→ 'బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై చిరు వ్యాపారులు చెల్లిస్తున్న వడ్డీని ప్రభుత్వం ప్రతి ఆర్నెల్లకో సారి తిరిగి వెనక్కి ఇవ్వడమనేది వ్యవస్థలో గొప్ప మార్పు అర్హత ఉన్నా.. ఎవరైనా పేద కాన్ని అందుకోలేకపోతే వారు గ్రామ సచివాల యాల్లో సంప్రదించినా, వాలంటీర్లకు చెప్పినా, 1902 నంబరుకు ఫోన్ చేసినా సరే.. రుణా ఉండేలా ప్రభుత్వం సహకరిస్తుంది. 
 
→ ఈ ఏడాది సకాలంలో అప్పు చెల్లిస్తే రూ. వెయ్యి పెంచి రూ.11వేలు ఇచ్చేలా బ్యాంకులను ఒప్పించాం.. ఇదీ పెంచి రూ. 12వేలు ఇప్పించేలా చూస్తాం'. అని సీఎం వివరించారు. 
 AP