image



తెలంగాణకు తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నియామకం
January 2023



→ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎ. శాంతికుమారి నియమితులయ్యారు. 
 
→ రాష్ట్రానికి ఆమె తొలి మహిళా సీఎస్ కావడం విశేషం. 
 
→ 1980 బ్యాచ్ కు చెందిన ఆమె ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా ఉన్నారు. 
 
→ శాంతికుమారి పదవీ కాలం 2025 ఏప్రిల్ వరకు ఉంది. 
 
→ఇప్పటివరకు సీఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ ఏపీ కేడర్లోనే కొన సాగాలని, ఆయన ఈ నెల 12లోగా ఆ రాష్ట్రంలో చేరా అని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ   ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 
 
→తె లంగాణ ఆవిర్భావం తర్వాత సీఎస్ గా మహిళ నియ మితులవడం ఇదే తొలిసారి. 
 
→ఏపీలోని కృష్ణా జిల్లాలో 1985 ఏప్రిల్ 7వ తేదీన జన్మించిన శాంతికుమారి మెరైన్ బయాలజీలో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి 1989లో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. 
 



TS