image



శక్తిమంతమైన పాస్ పోర్ట్ జాబితాలో 85వ స్థానంలో భారత్
January 2023



 
→ ప్రపంచంలోనే 2023కిగానూ శక్తిమం తమైన పాస్పోర్ట్ దేశాల జాబితాను హెన్రీ పాస్ పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది. 
 
→  అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా 199 దేశాలతో కూడిన ఈ జాబితాను ప్రకటించింది. 
 
→  ఇందులో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గతే డాది ఈ ర్యాంకింగ్స్ లో మనదేశం 83వ స్థానంలో ఉండటం గమనార్హం. 
 
→  భారత పాస్పోర్టుతో 2022లో 60 దేశాల్లో పర్యటించేం దుకు వీలుండగా, ఈ ఏడాది 59 దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి. 
 
 → గతేడాది భారత పాస్ పోర్ట్ ఉన్నవారికి వీసా లేకుండానే పర్యటిం చేందుకు అనుమతించిన సెర్బియా, ఈ ఏడాది ఆ సడలింపును తొలగించింది. 
 
→  హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం 2006లో భారత్ 71వ స్థానంలో ఉండేది.
 
→  తాజా జాబితాలో జపాన్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. దేశ పాస్పోర్టు ఉంటే 193 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చు. 
 
→  జాబితాలో సింగపూర్, దక్షిణ కొరియా రెండు, మూడో స్థానాలు దక్కించుకు న్నాయి. చైనా 66, పాకిస్థాన్ 106 స్థానాల్లో నిలి చాయి. 
 
→  అత్యంత బలహీనమైన పాస్పోర్ట్ అఫ్గానిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది.
 



Misc