image



దీర్ఘకాలంలో అతి పెద్ద సవాలు.. వాతావరణ మార్పు
January 2023



→  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే దీర్ఘకాలిక సవాళ్లలో అతి పెద్దది వాతావరణ మార్పే అయినా.. ప్రపంచం దీనికి అంతగా సిద్ధం కాలేదని ప్రపంచ ఆర్థిక ఫోరం తన తాజా నివేదికలో తెలిపింది. 
 
→జీవన వ్యయ సంక్షోభం వల్ల ఎదురవుతున్న స్వల్పకాలిక సమస్యలే ఇందుకు కారణమంది. 
 
→వచ్చేవారం దావోస్లో వివిధ ప్రభుత్వాధినేతలు, వ్యాపారవేత్తలు సమా వేశమవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక ఫోరం తన 'గ్లోబల్ రిస్క్ రిపోర్ట్'లో ఈ విషయం చెప్పింది. 
 
→మొత్తం 1200 మంది విపత్తు నిపు ణులు, పరిశ్రమల యజమానులు, విధాన నిర్ణేత లతో చేసిన సర్వేలో.. రాబోయే దశాబ్దంలో ఎదు రయ్యే అతి పెద్ద సమస్యలలో పర్యావరణమే ముందుంటుందని, అయినా స్వల్పకాల సమస్యల పైనే ప్రపంచాధినేతలు దృష్టిసారిస్తున్నారని అంతర్జాతీయ బీమా బ్రోకర్ మార్ష్ మెక్ నన్, జ్యూరిచ్ ఇన్సూరెన్స్ గ్రూప్ విడుదల చేసిన ఈ నివేదికలో తెలిపారు.
 



International