→ సాయుధ పోరాటాలు దేశభక్తి కాంక్షను రగిల్చి కాంగ్రెస్ నేతృత్వంలో స్వాతంత్య్ర సంగ్రా మానికి ఎంతో సాయపడినా దురదృష్టవశాత్తూ చరిత్ర పుస్తకాల్లో వాటికి తగినంత ప్రాధాన్యం లభించలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక కోణాన్నే ప్రపంచానికి చాటిచెప్పినా నిజానికి ఎంతోమంది వ్యక్తులు, ఆలోచనలు, సంస్థలు సాయపడిన తీరు ఈ ఉద్యమంలో అమూల్యమై నదని అన్నారు.
→ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తీరుపై ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలిసభ్యుడు సంజీవ్ సన్యాల్ రచించిన రెవల్యూషనరీ పుస్తకాన్ని దిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా షా ప్రసంగించారు.
→'స్వాతంత్య్ర పోరాటంలో అహింసా ఉద్యమానికి ఎలాంటి పాత్ర లేదనో, అది చరిత్రలో భాగం కాదనో నేను చెప్పబోను. అది గొప్ప పాత్ర పోషించింది.
→కానీ ఇంకెవరూ ఎలాంటి కృషి చేయలేదని చెప్పడం మాత్రం సరి కాదు' అని వివరించారు.
→నేతాజీ సుభాష్ చంద్ర బోసు, ఆయన నేతృత్వంలోని ఐఎన్ఏ పోషిం చిన పాత్రకు దేశ చరిత్రలో తగినంత గౌరవం లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
National