image



10 దేశాల ఎన్ఆర్ఐలూ యూపీఐ వినియోగించుకోవచ్చు




 
→  అమెరికా, కెనడా, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ ఐ) కూడా తమ ఎన్ఆర్ఆ/ఎన్ఆర్ట్ ఖాతాల నుంచి యూపీఐ ప్లాట్ఫామ్ను వినియోగించుకుని నిధులు బదిలీ చేయొచ్చని నేష నల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) ప్రకటించింది. 
 
→  యూపీఐ సేవలకు తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్లనూ వినియోగించుకునేందుకు అనుమ తించాలనే అభ్యర్ధనలు ప్రవాసుల నుంచి వచ్చాయని ఎన్పీసీఐ తెలిపింది. 
 
→  ఇందుకనుగుణంగా ఏప్రిల్ 30 కల్లా చర్యలు తీసుకోవాలని యూపీఐ సేవలు అందిస్తున్న ఆర్థిక సంస్థలకు ఎన్పీసీఐ సూచించింది. 
 
→  తొలుత ఈ 10 దేశా లోని ఎన్ఆర్ఎలు రూపాయల్లో నిధులు బదిలీ చేసే వీలుంటుందని, తదు పరి ఇతర దేశాలకూ విస్తరిస్తామని వెల్లడించింది. 
 
→  భారత    కు వచ్చినప్పుడు ఎన్ఆరలకు ఇది మరింత సౌలభ్యంగా ఉంటుందని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ విశ్వాస్ పటేల్ వివరించారు.
 



National