image



ప్రపంచంలోనే అత్యుత్తమ సమయపాలన పాటిం చిన 20 విమానాశ్రయాలు, విమానయాన సంస్థలతో రూపొందించిన జాబితా




→  ప్రపంచంలోనే అత్యుత్తమ సమయపాలన పాటిం చిన 20 విమానాశ్రయాలు, విమానయాన సంస్థలతో రూపొందించిన జాబితాలో కోయంబత్తూర్, ఇండిగో చోటు సాధించాయి.
 
→  2022కు సంబంధించి విమానయాన రంగ విశ్లేషణా సంస్థ ఓఏజీ రూపొందించిన నివేదికలో, దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కు 15వ స్థానం, ప్రభుత్వ రంగంలోని కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ 13వ స్థానం దక్కించుకున్నాయి. 
 
→  ఇండిగో ఆన్లైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ) 83.51 శాతంగా నమోదైంది. 2019లో 77.38 శాతంతో ఈ సంస్థ 54వ స్థానంలో ఉంది.
 
→గరుడ ఇండోనేషియా 95.63% ఓటీపీతో అగ్ర స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా సంస్థ సఫైర్ (95.30 శాతం), జర్మనీ సంస్థ యూరో వింగ్స్ (95. 26 శాతం) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
 
→ థాయ్ ఎయిరేషియా (92, 33 శాతం), దక్షిణ కొరియా సంస్థ జెజు ఎయిర్లైన్స్ (9184 శాతం) నాలుగు,అయిదు స్థానాలు దక్కించుకున్నాయి. 
 
→జాబితాలోని థాయ్ స్మైల్ ఎయిర్వేస్ (16వ ర్యాంక్), డెల్టా ఎయిర్ లైన్స్ (17), వివా ఎయిర్ కొలంబియా (18), ఎతిహాద్ ఎయిర్వేస్ (19), ఎమిరేట్స్ (20) కంటే ఇండిగో (15) ముందు వరుసలో ఉంది.
 
మెగా ఎయిర్ లైన్స్ లో 5వ స్థానం:- 
 
 
→2022లో అత్యధికంగా షెడ్యూల్డ్ విమానాలను నడి పిన 20 సంస్థలను మెగా ఎయిర్లైన్స్ గా నివేదిక గుర్తిం చింది. 
 
→టాప్-20 మెగా ఎయిర్లైన్స్ ఓటీపీ పరంగా ఇండిగో 5వ స్థానంలో ఉంది. ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ (88.79 శాతం) అగ్రస్థానంలో ఉంది. 
 
→జపాన్ ఎయిర్లైన్స్ (88.07 శాతం) లాటమ్ ఎయిర్లైన్స్ గ్రూప్ (85.03 శాతం), ఆజుల్ ఎయిర్లైన్స్ (84.87 శాతం) తర్వాత స్థానాల్లో నిలిచాయి.
 
→తక్కువ టికెట్ ధరలతో సర్వీసులు నడిపే విమాన యాన సంస్థల్లో, సమయపాలన పరంగా ఇండిగోకు ఆరో స్థానం లభించింది.
 
→ అంతర్జాతీయంగా ఓటీపీ పరంగా ఉత్తమ 20 విమా నాశ్రయాల్లో కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ (88,01 శాతం ఓటీపీ) కు 13వ ర్యాంకు లభించింది. జపాను చెందిన ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయం 91.45 శాతం ఓటీపీతో అగ్రస్థానం దక్కించుకుంది.
 
→ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని విమానాశ్రయాల్లో అత్యంత సమయపాలన ప్రదర్శించిన విమానాశ్రయాల్లో కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కు 10వ ర్యాంకు లభించింది.
 
→విమానాయాన సంస్థకు ర్యాంకు ఇలా: షెడ్యూల్ సమయానికి 15 నిముషాల కంటే తేడా లేకుండా రాకపో కలు సాగించడాన్ని ఓటీపీగా పరిగణిస్తారు.
 
→విమానాశ్రయాలకు: ఆయా విమానాలకు కేటాయిం చిన స్లాట్కు 15 నిముషాల కంటే తేడా లేకుండా రాకపో కలు సాగించడాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
 



International