image



బాస్మతీ బియ్యం గుర్తింపునకు ప్రమాణాల ఖరారు




→ దేశంలో ప్రప్రథమంగా బాస్మతి బియ్యం గుర్తింపునకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సమగ్ర ప్రమా ణాలు ఖరారు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన జారీ చేసింది.
 
→ కేంద్రం గుర్తించిన ఈ ప్రమాణాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి.
 
 
→ దర్శక వాణిజ్య విధానాల అమలుకుతోడు కల్తీ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ఈ చర్య లకు ఉపక్రమిస్తోంది.
 
→ సహజ పరిమళాలు ఉండే ఈ బియ్యంలో కృత్రిమ రంగులు, పాలిషింగు, సువాసనలు ఉండరాదన్నది ప్రభుత్వ ఉద్దేశం.
 
→ ధాన్యం సగటు పరిమాణం, వండిన తర్వాత పొడవు నిష్పత్తి వంటివి కూడా పరిశీలిస్తారు. బియ్యంలో తేమ, చక్కెర (ఆమైలోజ్) పరి మాణం, యూరిక్ ఆమ్లం, ధాన్యం నాణ్యత పరి గణనలోకి తీసుకుంటారు. ఈ బియ్యంలో బ్రౌన్ బాస్మతీ, మరపట్టిన బియ్యం, పారాబాయిల్డ్ వంటి రకాలు ఉన్నాయి.
 



Misc