image



అరుదైన వీరగల్లు శాసనం గుర్తింపు




→ బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో పదో శతాబ్దం నాటి అరుదైన వీరగల్లు (యుద్ధంలో మరణించిన వారి స్మారకార్ధం వేసే శిల) శాసనం గురువారం వెలుగు చూసింది. 
 
→ గ్రామంలోని మల్లికార్జునస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టగా.. అద్దంకి ప్రాంతానికి చెందిన చరిత్ర పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి గుడి గోడపై దీన్ని గుర్తించారు. 
 
→ మట్టితో నిండిన శాస నాన్ని శుభ్రం చేసి పరిశీలించారు. చాళుక్యుల లిపిగా తెలుస్తోందని, మాడయ్య అనే అతను మాధవస్వామి సన్నిధిలో తన తమ్ముడి పేరిట వేయించిన వీరగల్లుగా తెలిపారు. 
 
→ త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ధర్మవరం పరిసరాల్లో ఇలాంటి శాసనం మొదటిసారిగా వెలుగు చూసినట్లు  వివరించారు.
 
 



AP