image



'సేతు సముద్రం'లో కీలక ముందడుగు




 
→ సుదీర్ఘ కాలంగా విభిన్న చర్చలకు కేంద్రంగా ఉన్న నేతు సముద్రం ప్రాజెక్టుకు సంబం ధించి కీలక ముందడుగు పడింది. 
 
→ దీని నిర్మాణానికి ఆమోదిస్తూ పార్టీలకు అతీతంగా తమిళనాడు అసెంబ్లీ  తీర్మానించడంతో మరోసారి కదలిక వచ్చింది. 
 
→ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం తమిళ నాడు సహా దేశాభివృద్ధికి అవరోధంగా మారుతోందని, దీనిని పూర్తిచేయాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తు న్నామంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది. 
 
→ భారత్, శ్రీలంక మధ్య రామసేతు ఉందని చెప్పడం కష్టమంటూ కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
 
ఏమిటీ సేతు సముద్రం?:- 
 
→భారత తూర్పు, పశ్చిమ తీరాల మధ్య ప్రయాణిం చాలంటే ప్రస్తుతం శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. 
 
→భారత్-శ్రీలంకల మధ్య చిన్నపాటి మార్పులు చేస్తే అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా భారత్ జలా ల్లోంచే నౌకలు ప్రయాణించే వీలు ఉంటుంది. 
 
→ఇందు కోసం పురాతన రామసేతు మార్గంలో కొంతభాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. 
 
→ఇది పూర్తిచేయాలని 1880 లోనే బ్రిటిష్ ప్రభుత్వం భావించినా.. రామసేతు హిందువుల విశ్వాసాలకు సంబంధించిన విషయమని, దానిని కూల్చడానికి వీల్లేదంటూ ఆందోళనలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది.
 
→డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై. ఆ తర్వాత కరు ణానిధి సేతు సముద్రం సాకారానికి ప్రయత్నించారు. 
 
→ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ దీని విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాజపేయీ ప్రధా నిగా ఉండగా తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర
ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది.
 
→ఆనం తరం మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రూ.2,400 కోట్లతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా హిందూ సంఘాలవారు. పర్యావరణవే త్తలు అడుకున్నారు. 
 
→దీంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపి వేయాల్సిందిగా 2007లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 



National