image



'దగ్గు మందుతో 'పార్కిన్సన్స్' తగ్గు!




→ శ్వాసకోశ సమస్యల చికిత్స కోసం వాడే ఆంబ్రోక్సోల్ అనే మందు.. పార్కిన్ సన్స్ వ్యాధి పైనా పని చేస్తుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా తేల్చారు. 
 
→నాడీ సంబంధమైన ఈ రుగ్మత లక్షణాలను ఇది నెమ్మ దింపచేయగలదని నిర్ధరించారు. ఆంబ్రోక్సోల్.. గొంతులో కఫాన్ని తగ్గిస్తుంది. దగ్గు నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. 
 
→యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలూ దీనికి ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజీ లండన్ (యూసీఎల్) కు చెందిన క్వీన్ స్క్వేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీ శాస్త్రవేత్తలు దీన్ని పార్కిన్సన్స్ వ్యాధి పై ప్రయోగించి  చూశారు. 
 
→వారు నిర్వహించిన రెండో దశ క్లినికల్ పరీక్షల్లో ఆశాజనక ఫలి తాలొచ్చాయి. 
 
→పార్కిన్సన్స్ వ్యాధి బాధితులకు ఈ మందు సురక్షితమేనని తేల్చారు. ఈ ఔషధం మెదడులోకి సమర్థంగా చేరుతోందని, జీ కేస్ అనే ప్రొటీన్ స్థాయిని పెంచుతుందని గుర్తించారు. 
 
→ఇది అల్ఫా సైన్యూక్లిన్ సహా అనేక వ్యర్థ ప్రొటీన్లను నిర్మూలించడంలో కణాలకు సాయం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
→పార్కిన్ సన్స్ వ్యాధిగ్రస్థుల్లో ఈ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నా యని, ఈ రుగ్మతకు ఇదే కారణమని భావిస్తున్నారు. 
 
→ఈ ఔషధంపై మరింత విస్తృత స్థాయిలో మూడో దశ క్లినికల్ ప్రయోగా లను శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు. ఇందులో పరీక్షార్థులకు ఆంబ్రోక్సో ల్ను రెండేళ్ల పాటు ఇచ్చి పరీక్షించనున్నారు. 
 
→దీనివల్ల బాధితుల జీవన నాణ్యత, కదలికలు ఎంతమేర మెరుగుపడ్డాయన్నది పరిశీలిస్తారు.
 



Science