→ సీతారాముల జన్మస్థానాలుగా భావి స్తున్న నేపాల్లోని జనకప్పుర్, భారత్లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రక టించింది.
→కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 'దేఖో అప్నా దేశ్ పిలుపునకు అనుగుణంగా ఈ భారత్ గౌరవ్ పర్యాటక రైలును ఫిబ్రవరి 17న ప్రారం భిస్తారు.
→'ఏడు రోజుల ప్యాకేజీలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు మొదట ఆయోధ్యలో ఆగుతుంది.
→అక్కడ రామ జన్మ భూమి, హనుమంతుడి ఆలయాల సందర్శన తర్వాత నందిగ్రాంలోని భారత్ మందిరాన్ని దర్శించుకోవచ్చు.
→అనంతరం బిహార్ లోని సీతా మడీకి చేరుకొంటుంది. అక్కడి నుంచి 70 కి. మీ.ల దూరాన నేపాల్లో ఉన్న జనకప్పుర్ కు యాత్రికులను బస్సుల్లో తరలిస్తారు.
→సీతమ్మ జన్మస్థానంగా భావించే ఇక్కడ రెండు రాత్రు లున్న తర్వాత తిరుగు ప్రయాణంలో వారణాసి లోనూ రెండు రోజుల బస ఉంటుంది.
→ ప్రయా గా రాజ్లో ఒకపూట గడిపాక దిల్లీకి తిరిగివ స్తారు.
→ ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ. 39,775, ఇందులో ఏసీ రైలు ప్రయాణం, ఏసీ గదుల్లో బస, శాకాహార భోజనం, బస్సులు, గైడ్ ల ఖర్చులు, బీమా సదుపాయం కలిసి ఉంటాయి' అని రైల్వేశాఖ వివరించింది.
National