image



2022 ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌ సాధించిన కార్ల్‌సెన్ మరియు టాన్ జోంగీ




→GM మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) కజకిస్తాన్‌లోని అల్మాటీలో జరిగిన 2022 ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో తన నాల్గవ టైటిల్‌ను సాధించాడు.
 
→విన్సెంట్ కీమర్ (జర్మనీ) రజతంతో సరిపెట్టుకోగా, ఫాబియానో కరువానా (అమెరికా) కాంస్యం దక్కించుకున్నాడు.
 
→కాగా, 2022 మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా టాన్ ఝొంగీ (చైనా) స్వర్ణం సాధించింది.
 
→భారత చెస్ క్రీడాకారిణి, బి సవిత శ్రీ మహిళల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది . దీంతో ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్ మరియు హంపీ తర్వాత పతకాన్ని గెలుచుకున్న మూడవ భారతీయురాలుగా నిలిచింది .
 



Sports