image



మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస




→లష్కరే తోయిబా(ఎల్ ఈటీ) డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహమాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవా దిగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస)  నిర్ణయం తీసుకుంది. 
 
→భద్రతా మండలికి చెందిన ఐఎస్ఐఎల్, ఆల్వైదా ఆంక్షల కమిటీ మక్కీని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 
 
→భారత్, అమెరికా ఈ మేరకు ప్రతిపాదన చేయగా ఏడు నెలల క్రితం చైనా అడ్డుపడింది. తాజాగా డ్రాగన్ తన అభిప్రాయాన్ని మార్చుకో వడంతో ఈ నిర్ణయం వెలువడింది. 
 
→మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంతో అత డికి సంబంధించిన ఆస్తుల స్వాధీనం, ప్రయా ణాలు, ఆయుధాల కొనుగోళ్లపై నిషేధం మొదలై నవి అమలులోకి వస్తాయి. 
 
→తన మిత్రపక్షాలతో కలిసి పోరాటం చేస్తున్న భారత్కు ఇది అద్భుత దౌత్య విజయమని ఐరాసలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి టి.ఎస్. తిరుమూర్తి వ్యాఖ్యానిం చారు. 
 
→మక్కీ లాహోర్లో గృహ నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐరాస నిషేధిత జాబితాలో పాకిస్థాన్ కు చెందిన లేదా పాకిస్థా నో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవా దుల సంఖ్య సుమారు 150కి చేరింది.
 



International