image



సుదూర నక్షత్రమండలం నుంచి రేడియో సంకేతం




→ విశ్వంలో సుదూర నక్షత్ర మండలం (గెలాక్సీ)లోని పరమాణు హైడ్రోజన్ నుంచి వెలువడిన ఒక రేడియో సంకేతాన్ని కెనడా, భారత్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 
 
→ ఇంత దూరం నుంచి వచ్చిన ఇలాంటి సిగ్నల్ను పసి గట్టడం ఇదే మొదటిసారి. 
 
→ ఇందుకు పుణెలోని జయంట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎం ఆర్డీ)ను ఉపయోగించారు. 
 
→ పరమాణు హైడ్రో జన్ అనేది ఒక గెలాక్సీలో నక్షత్ర ఆవిర్భావానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం. 
 
→ సమీపంలోని వేడి అయనైజ్డ్ వాయువు.. గెలాక్సీలోకి వచ్చిప డినప్పుడు అది చల్లబడుతుంది. 
 
→ అనంతరం పర మాణు హైడ్రోజన్ గా మారుతుంది. తర్వాత అది మాలిక్యూలర్ హైడ్రోజన్గా రూపాంతరం చెందు తుంది. 
 
→అంతిమంగా అది నక్షత్ర ఆవిర్భావానికి దారితీస్తుంది. పరమాణు హైడ్రోజన్.. 21 సెంటీ మీటరు తరంగదైర్ఘ్యంలో రేడియో తరంగాలను వెలువరిస్తాయి. 
 
→అందువల్ల వాటిని జీఎంఆర్టీ వంటి తక్కువ పౌనఃపున్య రేడియో టెలిస్కోపు లతోనే గుర్తించవచ్చు. 
 
→అయితే తాజా తరంగం చాలా సుదూర గెలాక్సీ నుంచి వచ్చినందు వల్ల అది బలహీనంగా ఉంది. 
 
→జీఎంఆర్టీ డేటాను విశ్లేషించిన కెనడాలోని ట్రాటియర్ స్పేస్ ఇన్స్టి ట్యూట్, బెంగళూరులోని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించగలిగారు. 
 
→'గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే పోకడ వల్ల ఇది సాధ్యమైంది.
 



Science