imageఇన్ఫెక్షన్ మరణాలను తగ్గించే ప్రొటీన్
→ తీవ్రస్థాయి ఇన్ ఫెక్షన్లతో జరిగే మరణాలను తగ్గించడంలో ఒక ప్రొటీన్ పాత్రను జపాన్ శాస్త్రవే త్తలు గుర్తించారు.
 
→ శరీరం మొత్తానికి ఆక్సిజన్,  పోషక పదార్థాలను చేరవేయడంలో రక్తప్రస'రణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. 
 
→ ఈ రక్త నాళాల గోడలకు పూతగా ఉండే కణాల మధ్య ఖాళీని వాస్క్యులర్ పర్మియబులిటీగా పేర్కొంటారు.
 
→ రక్త నాళాలకు పరిసరాల్లోని కణజాలానికి మధ్య వివిధ రకాల పదార్థాల మార్పిడి సజావుగా సాగేలా ఇది చూస్తుంది. 
 
→ ఇన్ఫెక్షన్ కు శరీర రోగ నిరోధక వ్యవస్థ స్పందించే సమయంలో పర్మియబులిటీ వల్ల ముఖ్య మైన రోగ నిరోధక కణాల కదలికలు సాఫీగా సాగు తాయి. 
 
→ ఇది ప్రమాదకరమైన సూక్ష్మజీవుల నిర్మూలనకు దోహదపడుతుంది. అయితే ఈ పర్మియబులిటీ మరీ ఎక్కువగా ఉంటే తీవ్ర విపరిణామాలు తప్పవు. 
 
→కొవిడ్- 19 వంటి తీవ్ర ఇన్ఫెక్షన్ల సమయంలో ఇది చోటుచేసు కుంటుంది. దీనివల్ల అవయవాలు దెబ్బతినడంతోపాటు మరణం సంభవిస్తుంది. 
 
→రక్తనాళం లోపలి పొర (ఎండో థీలియల్)ల్లోని కణాల్లో ఉండే రోబో4 అనే కీలక ప్రొటీ న్కు వాస్క్యులర్ పర్మియబులిటీలో ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది.
 
→ఈ నేపథ్యంలో జపాన్ శాస్త్రవే త్తలు.. దాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ సమస్యను అదుపు చేయవచ్చా అన్నది తేల్చేందుకు ఎలుకలపై పరి శోధనలు జరిపారు.
 
→ఏఎల్కే ఇన్హిబిటర్ మందులతో చికిత్స చేస్తే రోబో4 ప్రొటీన్ స్థాయి పెరుగుతుందని, దీనివల్ల పర్మియబులిటీ తగ్గుతుందని తేల్చారు.
 Science