image



పరాక్రమ్ దివస్: నేతాజీ గుర్తుగా నిర్మించనున్న స్మారకాన్ని ఆవిష్కరించిన మోదీ




→భారత చరిత్రకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అసమాన సేవ చేశారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు.
 
→సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకొని మోదీ, ఆయనకు నివాళులు అర్పించారు.
 
→ఈ మేరకు ట్వీట్ చేశారు.
 
→"నేడు పరాక్రమ దినోత్సవం సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోసు నా నివాళులు. ఆయన దేశ చరిత్రకు అసమాన సేవ చేశారు. వలస పాలనకు వ్యతిరేకంగా ఆయన కనబరిచిన ధీరత్వం ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆలోచనలు స్ఫూర్తిని రగిలించాయి. ఆయన కలగన్న భారతన్ను నిర్మించేందుకు మేం కృషి చేస్తున్నాం" అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
 
→సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23వ తేదీని భారత ప్రభుత్వం 'పరాక్రమ దివస్'గా 2021లో ప్రకటించింది.
 
 
 
                                       అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు 
 
→సుభాష్ చంద్రబోస్   జయంతిని పురస్కరించుకొని   ప్రధాని మోదీ, అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారు.
 
→ఈ కార్యక్రమానికి మోదీ వర్చువల్ గా హాజరయ్యారు.
 
→అలాగే నేతాజీ గుర్తుగా "నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం"లో నిర్మించనున్న జాతీయ స్మారకాన్ని ఆయన ఆవిష్కరించారు.
 



National