image



గణతంత్ర కవాతుకు 'కోనసీమ ప్రభల తీర్థం' శకటం




→కోనసీమ పల్లెల్లో సంక్రాంతి సంబరాలను గణతంత్ర దినోత్సవ కవాతులో ఆంధ్రప్రదేశ్ శకటం ఆవిష్కరించనుంది. 
 
→74వ గణ తంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్య పద్లో గురువారం నిర్వహించే కవాతులో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి 'కోనసీమ ప్రభల తీర్థం' నేప థ్యంగా శకటాన్ని రూపొందించారు. 
 
→కోనసీమ ప్రభల తీర్థానికి 450 ఏళ్ల కుపైగా చరిత్ర ఉంది. టేకు చెక్కలు, వెదురు బద్దలు, తాటి శూలం, మర్రి ఊడలు, రంగుల నూలు దారాలు, నెమలి పింఛాలు, వరి కంకులు, కూరగాయలతో రూపొందించిన ప్రభలు ఏపీ శకటంపై కనువిందు చేయనున్నాయి. 
 
→ప్రజలంతా కరవుకాటకాలు లేకుండా సంతోషంగా జీవిం చాలనే ఉద్దేశంతో ప్రభల తీర్థం నిర్వహిస్తారని పౌర సంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.
 
→ కోనసీమలో ప్రభల తీర్థా నికి ప్రభలు ఎలా తీసుకెళ్ళతారు.. పచ్చని పొలాల మధ్య నుంచి ఎద్దుల బండిపై ఓ కుటుంబం తీర్థానికి ఎలా వెళుతుందనే విషయాన్ని కళ్లకు కట్టేలా శకటంపై తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. 
 
→ తీర్థంతో పాటు సంప్రదాయ గరగ నృత్యాన్ని ప్రదర్శిస్తామని వెల్లడించారు. శకటంపై నిజమైన కొబ్బరి చెట్లను అమర్చినట్లు ఆయన తెలిపారు.
 



AP