image



ఎంపాస్‌పోర్టు పోలీస్ యాప్‌ ప్రారంభం




→పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఎంపాస్‌పోర్టు పోలీస్  యాప్‌ పేరుతొ నూతన మొబైల్ అప్లికేషన్ ప్రారంభించింది.
 
→ ఈ కొత్త యాప్ మొబైల్ టాబ్లెట్‌ల ద్వారా డిజిటల్ మరియు పేపర్‌లెస్ వెరిఫికేషన్ రిపోర్టులను సమర్పించడానికి పోలీసు సిబ్బందిని అనుమతిస్తుంది, దీని ద్వారా పాస్‌పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ సమయాన్ని తగ్గిస్తుంది.
 
→ పోలీసు ధృవీకరణ అనేది పాస్‌పోర్ట్ జారీ వ్యవస్థలో అంతర్భాగం. ఈ ధృవీకరణ వ్యక్తిగతంగా చేయబడుతుంది.
 
→ దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న చిరునామాను పోలీస్ అధికారి సందర్శిస్తారు. సమాచార ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసిన తర్వాత, పోలీస్ స్టేషన్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నోటిఫికేషన్ పంపుతుంది. దీని తర్వాత, దరఖాస్తుదారునికి పాస్‌పోర్ట్ జారీ చేయబడుతుంది.
 
→ పాస్‌పోర్ట్ అనేది ఒక రకమైన వ్యక్తిగత గుర్తింపు పత్రం. ఒక వ్యక్తి పౌరసత్వం కలిగిఉన్న దేశాన్ని ధృవీకరించడానికి పాస్‌పోర్ట్ ఉపయోగించబడుతుంది. ఇది అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం మరియు చట్టబద్దం చేస్తుంది.
 



National