image



చైనా, రష్యా & దక్షిణాఫ్రికాల ఉమ్మడి నావికా వ్యాయామం మోసి II ప్రారంభం




 
రష్యా-చైనాలతో కలిసి దక్షిణాఫ్రికా సంయుక్త నావికా సైనిక వ్యాయామం నిర్వహించింది.
 
మోసి II పేరుతొ జరుగుతున్నా ఈ పదిరోజుల నావికా విన్యాసాలు దక్షిణాఫ్రికా తీరంలో హిందూ మహాసముద్రంలో జరుగుతున్నాయి. 350 మంది సాయుధ దళాల సభ్యులు ఇందులో పాల్గున్నట్లు దక్షిణాఫ్రికా జాతీయ రక్షణ దళం తెలిపింది.
 
జిర్కాన్ హైపర్‌సోనిక్ క్షిపణులను మోసుకెళ్లే అడ్మిరల్ గోర్ష్‌కోవ్ యుద్ధనౌకను పంపనున్నట్లు రష్యా ప్రకటించింది.
 
ఇవి ధ్వని కంటే తొమ్మిది రెట్లు వేగంతో ఎగురుతాయి మరియు 1,000 కిమీ (620 మైళ్ళు) లక్ష్య పరిధిని ఛేదిస్తాయి.
 
ఒక పక్కన ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం యొక్క మొదటి వార్షికోత్సవం జరుగుతుండగా చైనా, రష్యాలతో కలిసి
దక్షిణాఫ్రికా ఈ సైనిక వ్యాయామం నిర్వహించడం వివిధ ప్రపంచ దేశాల విమర్శలకు గురవుతుంది.
 
ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధ వివాదంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం తటస్థంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇలాంటి వార్షిక సైనిక విన్యాసాలు ఫ్రాన్స్ మరియు యుఎస్‌తో సహా ఇతర దేశాలతో మామూలుగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
 



International