image



యునిసెఫ్‌ బాలల హక్కుల జాతీయ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా




యునిసెఫ్‌ బాలల హక్కులకు సంబంధించి భారత జాతీయ రాయబారిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఫిబ్రవరి 19 న నియమితులయ్యారు.
 
దీనితో యునిసెఫ్ ఇండియాతో కలిసి బాలల హక్కుల కోసం తన సహాయాన్ని అందించనున్నారు.
 
 ఆయుష్మాన్ ఖురానా ఇది వరకు 2020 లో పిల్లలపై హింసను నిరోధించే మరియు విస్తృత బాలల హక్కుల ఎజెండా కోసం వాదించడానికి యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కూడా నియమితులయ్యారు. యూనిసెఫ్ బాలల హక్కుల కాపాడటం కోసం గ్లోబల్, రీజినల్ మరియు నేషనల్ అంబాసిడర్‌లను నియమిస్తుంది.
 
వీరి ద్వారా యూనిసెఫ్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది.
 
యునిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మానవతా మరియు అభివృద్ధి సహాయాన్ని అందించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ. దీని పూర్తి పేరు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. అయితే ఇప్పుడు అధికారికంగా యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్'గా పిలువబడుతోంది.
 
దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.
 



International