కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఫిబ్రవరి 20న మొదటి 'ఫ్రోజెన్ లేక్ హాఫ్ మారథాన్ నిర్వహించారు. లడఖ్‌లోని 13,862 అడుగుల ఎత్తులో ఉన్న ఘనీభవించిన పాంగోంగ్ త్సో సరస్సుపై, సున్నా ఉష్ణోగ్రతలలో విజయవంతంగా నిర్వహించిన ఈ 21-కిమీ ఆఫీషియల్ రన్నింగ్ ఈవెంట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఘనీభవించిన హాఫ్ మారథాన్‌గా గిన్నిస్ ప్రపంచ రికార్డులో నమోదు చేయబడింది.
ది లాస్ట్ రన్ థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని లడఖ్ ఆటోనొమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మరియు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ లడఖ్ ఉమ్మడిగా నిర్వహించాయి. హిమాలయ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో పాంగోంగ్ త్సో సరస్సు ఒకటి. ఇప్పుడు ఇది భారతదేశపు మొట్టమొదటి 'ఫ్రోజెన్ లేక్ హాఫ్ మారథాన్'కు ఆతిథ్యం ఇచ్చిన సరస్సుగా ప్రసిద్ధికెక్కింది.
National