image



కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా రాజీవ్ రఘువంశీ




→కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)గా రాజీవ్ రఘువంశీ నియమితులయ్యారు.
 
→రాజీవ్ రఘువంశీ ప్రస్తుతం ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్‌లో సెక్రటరీ-కమ్-సైంటిఫిక్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
 
→ఫిబ్రవరి 28 నుండి నూతన డిసిజిఐగా బాధ్యతలు స్వీకరిస్తారు.
 
 
→డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదా అనేది భారత ప్రభుత్వం యొక్క సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విభాగ అధిపతి. ఈ సంస్థ వ్యాక్సిన్‌లు మరియు  ఔషధాల యొక్క లైసెన్స్‌ల ఆమోదానికి బాధ్యత వహిస్తుంది.
 
→డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. భారతదేశంలో ఔషధాల తయారీ, అమ్మకాలు, దిగుమతి మరియు పంపిణీకి ప్రమాణాలను కూడా నిర్దేశిస్తుంది.
 



Appointment