image



రష్యాపై యూఎన్ నాన్‌బైండింగ్ రిజల్యూషన్‌ ఆమోదం




→ఉక్రెయిన్‌లో యుద్ధంను విరమించుకోవాలని కోరుతూ రష్యాకు పిలుపునిచ్చే నాన్‌బైండింగ్ తీర్మానానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి 23న ఆమోదం తెలిపింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తికావడంతో, రష్యా దండయాత్ర మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసతి ఈ బలమైన సందేశాన్ని పంపింది. తక్షణమే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
 
→ఉక్రెయిన్ తన మిత్రదేశాలతో సంప్రదింపులు జరిపి రూపొందించిన తీర్మానం 141-7 ఓటుతో యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఆమోదించబడింది, 32 దేశాలు గైర్హాజరయ్యాయి.
 
→ఇందులో భారతదేశం కూడా ఉంది. ఇక ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏడు దేశాలలో బెలారస్, నికరాగ్వా, రష్యా, సిరియా, ఉత్తర కొరియా, ఎరిట్రియా మరియు రష్యాతో సన్నిహిత సైనిక సంబంధాలను కలిగి ఉన్న మాలి దేశం ఉన్నాయి.
 



International