image



ప్రపంచ బ్యాంక్‌కు అధ్యక్షుడిగా అజయ్ బంగా




→మాస్టర్ కార్డ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించడానికి నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.
 
→అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
 
→అతను గతంలో జూలై 2010 నుండి డిసెంబర్ 31, 2020 వరకు మాస్టర్ కార్డ్ కంపెనీకి ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా సేవలు అందించారు.
 
→ప్రపంచ బ్యాంకు అనేది ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోభివృద్ధికై ధన సాయం చేసేందుకు గాను 1945 లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది.
 
→ప్రస్తుతం ఇది ఇది మూలధన ప్రాజెక్టులను చేపట్టలనే ఉద్దేశంతో పేద దేశాల ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేస్తుంది. ప్రపంచ బ్యాంకులో ప్రస్తుతం 189 సభ్య దేశాలు ఉన్నాయి.
 



Appointment