image



అబుదాబిలో 2023 ఐ2యూ2 బిజినెస్ ఫోరమ్




→ఫిబ్రవరి 21-22 తేదీల్లో అబుదాబిలో జరిగే ఐ2యూ2 యొక్క మొదటి వైస్ మినిస్టీరియల్ సమావేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇచ్చింది.
 
→ఈ ఏడాది నవంబర్ నెలలో కాప్28కి యూఏఈ ఆతిధ్యం ఇస్తున్నందున, ఈ సమావేశాల్లో భాగస్వామ్య దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని మరియు ఇంధన సంక్షోభం, వ్యాపార పెట్టుబడులు మరియు ఆహార అభద్రత నిర్వహణతో సహా, అత్యంత ముఖ్యమైన ఆర్థిక సమస్యలపై చర్చించారు.
 
→ఇదే వేదిక ద్వారా స్మార్ట్ వ్యవసాయానికి పెట్టుబడి మరియు మద్దతును వేగవంతం చేసే లక్ష్యంతో యూఎస్ మరియు యూఏఈ ప్రారంభించిన అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్ (AIM4C) లో ఇండియా చేరుతున్నట్లు ప్రకటించింది.
 
→ప్రస్తుతం ఈ జాబితాలో 42 దేశాల ప్రభుత్వాలతో పాటుగా 275 కంటే ఎక్కువ  వ్యవసాయ,క్లైమేట్ సంస్థలు ఉన్నాయి.
 
→ఐ2యూ2 అనేది భారతదేశం, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లతో కూడిన అంతర్-ప్రభుత్వ ఆర్థిక సహకార ఫోరమ్.
 
→దీనిని అక్టోబర్ 2021లో ప్రారంభించారు. దీనిని సభ్య దేశాల మధ్య నీరు, శక్తి, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం మరియు ఆహార భద్రతలో పాటుగా పరస్పర ఉమ్మడి పెట్టుబడుల ద్వారా పరస్పర సహకారం అందించేందుకు ప్రారంభించారు.
 



International