image



ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌లో రష్యా సభ్యత్వం రద్దు




→ఉక్రెయిన్ పైన యుద్ధం కారణంగా తమతో ఉన్న రష్యా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు, గ్లోబల్ యాంటీ మనీ లాండరింగ్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వెల్లడించింది.
 
→ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ భద్రత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో తమ ప్రధాన సూత్రాలకు వ్యతిరేకంగా రష్యన్ ఫెడరేషన్ యొక్క చర్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
 
→ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంతర్జాతీయంగా మనీలాండరింగ్ మరియు టెర్రరిజం ఫైనాన్సింగ్ నివారణకు బాధ్యత వహిస్తుంది. ఇది 200 కంటే ఎక్కువ దేశాలకు మరియు దర్యాప్తు సంస్థలకు భద్రత ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
 
→మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా మరియు తీవ్రవాదంతో సహా తీవ్రమైన నేరాలను పరిష్కరించడానికి అధికారులకు సహాయం చేస్తుంది.
 
→దీని ప్రధాన కార్యాలయం పారిస్ నగరంలో ఉంది. దీనిని 1989లో గ్రూప్ ఆఫ్ సెవెన్ దేశాలు ఏర్పాటు చేశాయి.
 
→ప్రస్తుతం దీనిని అధ్యక్షుడుగా ఇండియాకు చెందిన టి రాజ కుమార్ ఉన్నారు.
 



International