image



జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ భారత పర్యటన




→జర్మనీ ఛాన్సలర్, ఓలాఫ్ స్కోల్జ్ ఫిబ్రవరి 25-26 తేదీలలో భారతదేశంలో పర్యటించారు.
 
→ఛాన్సలర్‌గా భారతదేశంలో మొదటిసారి పర్యటించిన ఓలాఫ్ స్కోల్జ్, తన పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ముచ్చటించారు.
 
→ప్రధాని మోడీతో ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై చర్చలు జరిపారు. భారత్, జర్మనీలు జీ4 లో సభ్య దేశాలుగా ఉన్నాయి.
 
→2011లో ద్వైవార్షిక ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్ (IGC) మెకానిజం ప్రారంభమైన తర్వాత జర్మనీ ఛాన్సలర్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
 
→ఇరు నాయకుల ద్విపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉగ్రవాదం మరియు వేర్పాటువాదంపై పోరాటంలో భారతదేశం మరియు జర్మనీల మధ్య క్రియాశీల సహకారం ఉందని వెల్లడించారు.
 
→ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారానికి భద్రత మరియు రక్షణ చురుకైన మూలస్తంభమని ప్రధాన మంత్రి అన్నారు.
 
→గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్‌ని గత ఏడాది నా జర్మనీ పర్యటన సందర్భంగా ప్రకటించామని మోదీ చెప్పారు.
 
దీని ద్వారా క్లైమేట్ యాక్షన్ మరియు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ రంగాలలో ఇరు దేశాలు సహకారాన్ని విస్తరిస్తున్నాయని ఆయన హైలైట్ చేశారు.
 



International