మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరును 'ఛత్రపతి శంభాజీనగర్'గా మరియు ఉస్మానాబాద్ నగరాన్ని 'ధరాశివ్'గా పేరు మార్చడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పేరు మార్పుకు సంబంధించిన తీర్మానాన్ని గత ఏడాది జులై 16వ తేదీన మహారాష్టలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఆమోదించింది.
ఔరంగాబాద్‌ను సంభాజీనగర్‌గా మరియు ఉస్మానాబాద్‌ని ధరాశివ్‌గా పేరు మార్చేందుకు గతంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే షిండే తిరుగుబాటుతో గత జూన్‌లో ఆ ప్రభుత్వం కూలిపోయింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం గత కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేసి, తాజా నిర్ణయం తీసుకుంది.
National