imageఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫిబ్రవరి 13న అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
 
2015 లో తన కెరీర్ ప్రారంభించిన మోర్గాన్, ఇంగ్లాండ్ తరుపున 225 వన్డే మ్యాచులకు ప్రాతినిధ్యం వహించాడు.
 
ఈయన నాయకత్వంలో 125 వన్డేలు ఆడిన ఇంగ్లాండ్ జట్టు 76 మ్యాచులలో విజేతగా నిలిచింది.
 
మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లండ్ 2019లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
 
మోర్గాన్ 100 టీ20ఐలు (కెప్టెన్‌గా 57) ఆడిన ఇంగ్లండ్‌కు మొదటి పురుష క్రికెటర్‌గా నిలిచాడు.
 
ఐర్లాండ్‌లో జన్మించిన మోర్గాన్, 2006 అండర్-19 ప్రపంచ కప్‌లో ఐర్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
 
5 ఆగష్టు 2006న స్కాట్లాండ్‌తో జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్ తరపున తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
 
అలానే మోర్గాన్ రెండు దేశాల తరుపున ఒన్డే సెంచరీలు చేసిన మొదటి ఆటగాడుగా నిలిచాడు.
 Sports