image



ఏంజెలా మెర్కెల్‌కు యునెస్కో శాంతి బహుమతి




జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫెలిక్స్ హౌఫౌట్-బోయిగ్నీ యునెస్కో శాంతి బహుమతి 2022ను అందుకున్నారు.
ఈ అవార్డును గత ఏడాది చివరిలో యునెస్కో ప్రకటించింది.
 
తాజాగా ఐవోరియన్‌లో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో ఆమెకు అందజేశారు.
 
స్వదేశంలో మరియు యూరోపియన్ భాగస్వాములలో ప్రతిఘటన ఉన్నప్పటికీ 2015-2016 మధ్యకాలంలో 1.2 మిలియన్లకు పైగా శరణార్థులకు జర్మనీలోకి ఆహ్వానించి, వారికీ సహాయం చేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డు అందించారు.
 
ఏంజెలా మెర్కెల్ ఒక జర్మన్ మాజీ రాజకీయవేత్త మరియు శాస్త్రవేత్త. ఆమె 2005 నుండి 2021 వరకు జర్మనీ ఛాన్సలర్‌గా పనిచేశారు. మెర్కెల్ 2005లో జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు.
 
ఆమె ఛాన్సలర్‌గా ఉన్న సమయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) లో కీలక నాయకురాలిగా వ్యవహరించారు.
 
2014 -15 లలో సిరియా , ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇతర ప్రాంతాలలో చోటుచేసుకున్న సంఘర్షణల కారణంగా సొంత దేశాలను విడిచిన లక్షలాది మంది వలసదారులకు ఆమె నాయకత్వంలోని జర్మనీ పునరావాసం కల్పించింది.
 



International