image



ప్రసాద్ పథకం కింద కర్ణాటకలో 4 యాత్రిక కేంద్రాలు ఎంపిక




 
→ప్రసాద్ మరియు స్వదేశ్ దర్శన్ 2.0 పథకాల కింద అభివృద్ధి కోసం కర్ణాటకలో నాలుగు యాత్రికుల కేంద్రాలను ఎంపిక చేసింది.
 
→ఈ జాబితాలో మైసూరులోని చాముండేశ్వరి ఆలయం, ఉడిపి జిల్లాలోని శ్రీ మధ్వ వన, బీదర్ జిల్లాలోని పాప్నాష్ ఆలయం, బెళగావి జిల్లాలోని శ్రీ రేణుకా యల్లమ్మ ఆలయాలు ఉన్నాయి.
 
→స్వదేశ్ దర్శన్ పథకం కింద హంపి మరియు మైసూరు వారసత్వ ప్రదేశాలు ఇప్పటికే ఆ రాష్ట్రం నుండి ఎంపిక చేయబడ్డాయి.
 
→భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2014-2015 సంవత్సరంలో ప్రసాద్ పథకాన్ని ప్రారంభించింది.
 
→ఈ పథకం ద్వారా దేశంలోని తీర్థయాత్ర గమ్యస్థానాలను ఏకీకృతం చేస్తున్నారు.
 
→ఇందులో భాగంగా భారతదేశం అంతటా పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఆ ప్రాంతాల నివాసితులకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
 
→ప్రసాద్ పథకం పరిధిలో ఎంపికైన ప్రాముఖ్య యాత్ర కేంద్రాల జాబితాలో అమృత్‌సర్, అజ్మీర్, ద్వారక, మధుర, వారణాసి, గయా, పూరి, కాంచీపురం, వెల్లంకన్ని, కేదార్‌నాథ్, కామాఖ్య మరియు పాట్నా వంటివి ఉన్నాయి.
 
→ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతి మరియు శ్రీశైలం ఇందులో చోటు దక్కించుకున్నాయి.
 



National