image



ఐసీఏఐ కొత్త అధ్యక్షుడిగా అనికేత్ సునీల్ తలతి




ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త అధ్యక్షుడుగా అనికేత్ సునీల్ తలాటి నియమితులయ్యారు.
 
ఈయన 2023-24 ఏడాదికి సంబంధించి ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అదే సమయంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడుగా రంజీత్ కుమార్ అగర్వాల్ ఎన్నికయ్యారు.
 
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియంత్రణలోని భారతదేశపు అతిపెద్ద ప్రొఫెషనల్ అకౌంటింగ్ బాడీ. ఇది దేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తికి సంబందించిన వ్యవహారాలను నియంత్రించడం కోసం చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం ద్వారా 1949లో స్థాపించబడింది.
 
ఇది భారతదేశంలో అకౌంటింగ్ ప్రమాణాలు మరియు ఆడిటింగ్ ప్రమాణాలను నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) కి, భారత ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
 



Appointment