image



భారత్ ఫిజీ మధ్య వీసా మినహాయింపు ఒప్పందం




భారతదేశం మరియు ఫిజీ దేశాలు దౌత్య మరియు అధికారిక పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నవారి వీసా మినహాయింపుకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
 
ఈ ఒప్పందం ప్రకారం, దౌత్య మరియు అధికారిక పాస్‌పోర్ట్ హోల్డర్‌లు 90 రోజుల వరకు వీసా లేకుండా ఇరు దేశాల్లో సందర్శించేందుకు లేదా నివశించేందుకు అనుమతి లభిస్తుంది.
 
ఈ ఎంఓయూ ఒప్పందం ఫిజీ ప్రధాన మంత్రి సితివేణి రబుకా మరియు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సమక్షంలో జరిగింది.
 
ఈ ఒప్పందం ఫిజీని సందర్శించే భారత యాత్రికులకు, అలానే వైద్య చికిత్స మరియు విద్యా ప్రయోజనాల కోసం భారతదేశాన్ని సందర్శించే ఫిజీ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 
 
ఫిజీ, దక్షిణ పసిఫిక్‌లోని 322 ద్వీపాలతో కూడిన ఒక ద్వీపసమూహం. దీని రాజధాని నగరం సువా. ఇది ఆస్ట్రేలియా ఖండంలోకి వస్తుంది.
 
దీని మొత్తం జనాభా 10 లక్షలు. ఫిజీ మొత్తం జనాభాలో 37 శాతం మంది భారతీయ హిందువులు ఉండగా, 20 శాతం మంది ముస్లింలు మరియు 6 శాతం క్రైస్తవులు ఉన్నారు.
 



International