image



మెజారిటీ వర్గానికే పార్టీ గుర్తు




 
→రాజకీయ పార్టీల్లో చీలికలు తలెత్తిన ప్రతిసారీ వివాదాల పరిష్కారానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మెజారిటీ మంత్రమే పాటిస్తూ వస్తోంది. 
 
→శిందే వర్గానికి శివసేన పార్టీ చిహ్నమైన విల్లు-బాణం కేటాయింపులోనూ ఈ విధానాన్నే అనుసరించింది. 
 
→శాసనవ్యవస్థల్లో, పార్టీ శ్రేణుల్లో మెజారిటీ మద్దతు శిందే కూటమికే ఉందని, ఆ వర్గానికే గుర్తు పొందే అర్హత ఉందని స్పష్టం చేసింది. 
 
→ఇప్పుడు శివసేన తరహాలో మరో వివాదం ఎన్నికల సంఘం ముందు ఉంది. అదే బిహార్లోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్లేపీ) చీలిక వ్యవహారం. 
 
→కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాసవాన్ స్థాపించిన ఈ పార్టీ ఆయన మరణిం చిన కొన్ని నెలలకే 2021లో రెండుగా చీలింది. 
 
→ఓ వర్గానికి పాసవాన్ కుమారుడు చిరాగ్ పాస వాన్, మరో వర్గానికి అతని సోదరుడు పశుపతి కుమార్ పరాస్ నేతృత్వం వహిస్తున్నారు. 
 
→తద నంతర పరిణామాల్లో 2021 అక్టోబరులో ఆ పార్టీ గుర్తు అయిన బంగళాపై ఈసీ నిషేధం విధిం చింది. 
 
→తుది నిర్ణయం తీసుకొనేవరకు చిహ్నాన్ని రెండు వర్గాలూ వాడకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 
 
→అయితే శివసేన వివాదంలో ఎన్నికల సంఘం అనుసరించిన వైఖరి చూస్తే.. ఈ గొడవా మెజారిటీ ఆధారంగానే పరిష్కార మయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
 
→1969లో కాంగ్రెస్ తొలిసారి చీలినప్పటి నుంచి ఈసీ వైఖరి మెజారిటీయే. 
 
→ఈ విష యంలో ఎన్నికల సంఘం విధానాన్ని న్యాయస్థానాల బలప రుస్తూ వచ్చాయి. 
 
→రాజ్యాంగంలోని 324వ అధికరణం కింద, 1968లో వెలువడిన చిహ్నాల ఉత్తర్వుల ప్రకారం. పార్టీల గుర్తులపై నిర్ణయం తీసుకొనే అధికారం ఈసీకే ఉంది.
 
→2017లో పార్టీపై పట్టు కోసం సమాజ్వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు ములాయంసింగ్ యాదవ్, అతని కుమారుడు అఖిలేశ్ యాదవ్ మధ్య తలెత్తిన పోరు ఎన్నికల సంఘానికి చేరింది. 
 
→అప్పుడు కూడా శాసనసభ్యుల్లో, శ్రేణుల్లో ఆదరణ అఖిలేశ్ కే ఉందంటూ పార్టీ పేరును, గుర్తును అతనికే కేటాయించింది.
 
→2016లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఏఐడీఎంకే.. పన్నీ ర్ సెల్వం, శశికళ - పళనిస్వామి వర్గాలుగా విడి పోయి పార్టీ గుర్తు రెండాకులపై ఘర్షణ పడ్డారు. 
 
→తదనంతర పరిణామాల్లో పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలిసిపోయారు. దీంతో మెజారిటీ ఆధారంగా ఈ వర్గమే.. ఎన్నికల సంఘం నుంచి గుర్తును దక్కించుకుంది
 
 



National