image



తొలి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం




→  మార్టిన్ ఫౌండేషన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, స్పేస్ జోన్ ఇండియా సహకారంతో మహాబలి పురం సమీప పట్టిపుల్లంలో   నిర్వ హించిన భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంత మైంది. 
 
→  ముఖ్యఅతిథిగా పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హాజరయ్యారు. 
 
→  దేశంలోని వివిధ ప్రాంతాల ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులు తయారుచేసి పంపిన 150 బుల్లి ఉపగ్రహాలను వారే రూపొందిం చిన రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు. 
 
→  6 నుంచి 12వ తరగతి వరకు చదివే సుమారు 3,500 మంది విద్యార్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. 
 
→  తమిళనాడు, పుదుచ్చేరిలోని మత్స్యకార కుటుంబాలకు చెందిన 200 మంది విద్యార్థులు, గిరిజన తండాల పాఠశా లల్లోని వంద మంది విద్యార్థులూ ఇందులో ఉన్నారు. 
 
→  రాకెట్ ప్రయోగం విజయవం తంపై ముఖ్యఅతిథితో పాటు శాస్త్రవేత్తలు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
 



Science