imageగజల్ రచయిత్రి బైరి ఇందిర కన్నుమూత
→  కవయిత్రిగా, గజల్ రచయిత్రిగా సాహితీ సామ్రాజ్యాన్ని ఏలిన బైరి ఇందిర కన్ను మూశారు. 
 
→  కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె కడవరకు ఆత్మస్థై ర్యంతో జీవించారు. 
 
→  నేను పోయినప్పుడు ఒక కాగి తాన్ని కప్పండి.. రాసుకోవడానికి పనికొస్తుంది. మట్టిలో కప్పెట్టకండి.. మరీ గాలాడదు.. పురుగూ పుట్రా ఉంటాయి. పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్ బ్యాగులో ఉండేలా చూడండి.
 
→  సెల్ మర్చిపోయేరు.. బోర్ కొట్టి చస్తాను. పసుపూ గట్రా పూసి.. భయంకరంగా మార్చకండి.. పిల్లలు జడుసుకుంటారు.. పైగా నన్ను గుర్తు పట్టాలి కదా.. పనిలో పని కాష్టం దగ్గర కవి సమ్మేళనం పెట్టండి. 
 
→  నేను ఉ(వి)న్నట్టుంటుంది అనే కవితను వీలునామాగా రాసుకున్న అక్షరజీవి ఇందిర. 
 
→  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో జన్మించిన ఆమె స్వగ్రామంతో పాటు వరంగల్, హైదరాబాద్ లలో విద్యాభ్యాసం చేశారు. 
 
→  తన తండ్రి భైరి రామ్మూర్తి ప్రోత్సాహంతో బాల్యంలోనే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. పెళ్లయ్యాక భర్త రామశం కరయ్యతో కలిసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. 
 
→  ప్రధా నోపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేశారు. తెలం గాణ గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం, మన కవులు వంటి గజల్స్ సంకలనాలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. 
 
→  రావి రంగారావు సాహిత్య కళాపీఠం నుంచి 'జనరంజక కవి' పురస్కారం అందుకున్నారు. 
 
→  మహిళా గజల్ రచయితల్లో తొలిసారిగా గజల్స్ సంక లనాలను విడుదల చేసి చరిత్ర సృష్టించారు. ఆమె కుమార్తె హిమజా రామమ్ గజల్ గాయని.
 TS