→సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో తెల్లవారుజామున 'పెద్దపట్నం' వైభవోపేతంగా జరిగింది.
→మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ పరిధి తోటబావి సమీపంలోని కల్యాణ మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను ముగ్ధు లను చేసింది.
→మల్లికార్జునస్వామిని ధ్యానిస్తూ వేలమంది ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
→జాగరణ చేస్తూ రాత్రంతా క్రతువును వీక్షించారు.
→ రాత్రి 11.45 గంటలకు ప్రారంభమైన వేడుక ఆదివారం ఉదయం ఏడింటి వరకు కొనసాగింది.
→ ముందుగా అర కులు ఉత్సవ విగ్రహాలతో పాటు పట్నం తొక్కుతూ దాన్ని దాటగా తర్వాత వేలమంది.
→ భక్తులు శివతాండవం చేస్తూ వారిని అనుస రించారు.
AP