image



అత్యధిక విద్యుదుత్పత్తికి తోడ్పడేలా సరికొత్త మిశ్రమ లోహం




→  విద్యుదుత్పత్తి ప్రక్రియలో వెలువడే ఉష్ణాన్ని మరింతగా వినియోగించుకునేందుకు ఉపయో గపడే మహా మిశ్రమ లోహాన్ని (సూపర్ ఎలాయ్)ను అమెరికాలోని శాండియా నేషనల్ లేబరేటరీస్ పరిశోధ కులు త్రీడీ ముద్రణ పద్ధతిలో తయారుచేశారు. 
 
→  ప్రస్తుతం విద్యుదుత్పాదనకు ఉపయోగిస్తున్న గ్యాస్ టర్బైన్ యంత్రాల తయారీకి దీనిని ఉపయోగిస్తే. 
 
→  అద్భుతమైన ఫలితాలు రాబట్టొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికాలో 80 శాతం విద్యుత్ను శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. 
 
→  అక్కడ ప్రస్తుతం ఉపయోగిస్తున్న టర్బైన్లు ఒక స్థాయి వరకే ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. ఈ మహా మిశ్రమ లోహంతో టర్బైన్లను రూపొందిస్తే మరింత ఉష్ణోగ్రతలో కూడా పనిచేయగలిగి, ఆ వేడినంతటినీ విద్యు త్తుగా మారుస్తూ వృథాను అరికడుతుందని పరిశోధ కుల ఆలోచన. 
 
→42 శాతం అల్యూమినియం, 25 శాతం టైటానియం, 13 శాతం నియో బియం, 8 శాతం జిర్కోనియం, 8 శాతం లి, 4 శాతం టాంటలం లోహాలను కలిపి ఈ మిశ్రమ లోహాన్ని తయారుచే శారు. 
 
→దీనిని 800 సెల్సియస్ డిగ్రీల వరకు వేడిచేసి, వెంటనే సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకొచ్చేసినా దాని పటిష్ఠత చెక్కుచెదరలేదు. 
 
→తేలికగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలిగే ఈ మిశ్రమలోహాన్ని విమానాలు, రాకెట్లు, వ్యోమనౌ కలు, ఆటోమొబైల్ రంగంలోనూ వినియోగించవచ్చు.
 



Science